వికారాబాద్, జులై 19 (ప్రభ న్యూస్): 2022 సంవత్సరం మే 22న వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డి పేట చెరువు సమీపంలో పది లక్షల రూపాయలతో నిర్మించిన జంతు జనన నియంత్రణ కేంద్రం వృధాగా మారింది. అప్పట్లో మాజీ మంత్రి కేటీఆర్ చే ప్రారంభించబడిన ఈ జంతు జనన కేంద్రం కేవలం ఆరు మాసాల పాటే కొనసాగి అనంతరం తాళం వేసి వృధాగా మారింది.
ప్రధానంగా కుక్కల నియంత్రణ కోసం ఈ జంతు జనన నియంత్రణ కేంద్రం ప్రారంభించగా.. అది పూర్తిగా సఫలీకృతం కాలేదు. దీనికి తోడు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గల వీధికుక్కలను తీసుకొచ్చి, ఇక్కడ జంతువు జనన నియంత్రణ కేంద్రంలో టీకాలు ఇచ్చి వదిలివేయడంతో వికారాబాద్ జిల్లా కేంద్రంలో కుక్కలు అధికమయ్యాయి. పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా ఉంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కుక్కలను అరికడితే.. జిల్లాలోని ఇతర ప్రాంతంలోని కుక్కలను వికారాబాద్ లో చేరాయనడంలో ఎటువంటి సందేహం లేదు.