వికారాబాద్ టౌన్, జులై 16(ప్రభ న్యూస్): ఒక్క సీసీ కెమెరా 100మంది పోలీసులతో సమానం. సీసీ కెమెరాల చేత అనేక కేసులకు పరిష్కారం దొరికిందనేది నగ్న సత్యం. అందుచేతనే ప్రతి చోట సీసీ కెమెరాలు ఉండాలని ఎప్పుడూ అధికారులు చెబుతుంటారు. అందులో భాగంగానే వికారాబాద్ ఆర్టీసి బస్టాండ్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో బస్టాండు ప్రాంగణంలో రద్దీ బాగా పెరగడంతో పిక్ పాకెటర్ లు బస్టాండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారని, ప్రయాణీకుల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందనీ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డిపో ఇంచార్జీ టి.ఎం దాసు, హెడ్ కానిస్టేబుల్ పి.నర్సింలు, బస్ స్టేషన్ కంట్రోలర్ బి. సుదర్శన్, బస్సు పాస్ సెక్షన్ ఇంచార్జ్ కే.గోపాల్ లు సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన అనంతరెడ్డి హాస్పిటల్ యజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.