Friday, November 22, 2024

RR: మహిళ హత్య కేసును ఛేదించిన వికారాబాద్ పోలీసులు

వికారాబాద్ టౌన్, జనవరి 19(ప్రభన్యూస్): గత మూడు రోజుల క్రితం పులుమద్ది గ్రామ సమీపంలో జరిగిన మహిళ హత్య కేసును చెందిన పోలీసులు చేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వికారాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించి మహిళ హత్యకు గల కారణాలను వివరించారు.

చేవెళ్ల గ్రామానికి చెందిన అనసూయ (35) అనే మహిళకు ధారూరు మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన తలారి బాబుకు గత మూడు నాలుగు సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగుతుంది. బాబు పటాన్ చెరువులో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అనసూయకు పలు సందర్భాల్లో డబ్బులు ఇవ్వడం, ఆ డబ్బులు తిరిగి అడుగడంతో ఇరువురి మధ్య మనస్పార్ధాలు ఏర్పడి దూరంగా ఉంటూ వస్తున్నారు. అనసూయ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో తలారీ బాబు అనసూయను హత్య చేయాలని నిర్ణయించి ఈ నెల 14న వికారాబాద్ పులుమద్ది ప్రాంతానికి తీసుకొచ్చి మధ్యం తాగించి ఆపై హత్య చేసి నిప్పంటించాడు. మృతురాలి ఒంటిపై బంగారం, వెండి తీసుకెళ్లి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లుగా పోలీసులు తెలిపారు. 15వ తేదీన సర్పంచ్ మాదవరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని టీమ్ లు ఏర్పాటు చేసి 48 గంటలలో కేసును ఛేధించడం జరిగిందన్నారు. కేసును త్వరగా గుర్తించిన క్లోస్ చేసిన పోలీసులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ రవీందర్, డీఎస్పీ నర్సిములు, సీఐలు శ్రీను, ఆంజనేయులు, ఎస్ఐలు సంతోష్, అనిత, భరత్ భూషణ్ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement