వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సమస్యలపై ఎమ్మెల్యే ఆనంద్ మంగళవారం అసెంబ్లీలో గళమెత్తారు. ప్రధానంగా జిల్లా కేంద్రం సమీపంలోని శివారెడ్డి పేటను మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దాలని, ఎన్ని పల్లి నుండి శివారెడ్డి పేట వరకు రోడ్డు విస్తరణతో పాటు డివైడర్ ను ఏర్పాటు చేయాలని, ఎన్టీఆర్ చౌరస్తా నుండి రాజీవ్ నగర్ కాలనీ వరకు, చౌరస్తా నుండి ఆగిరిపల్లి వరకు రోడ్డు విస్తరించాలని కోరారు. స్పందించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ విషయాలను తాము నోట్ చేసుకొని పరిశీలిస్తామని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital