యాచారం : యాచారం మండలంలో కురిసిన ఆకాల వర్షానికి మండల పరిధిలోని పలు గ్రామాలలో పంటలు దెబ్బతిన్నాయి. గత రాత్రి కురిసిన ఆకాల వర్షానికి వరి పంట పూర్తిగా నేలకొరిగాయి. మండల పరిధిలోని నందివనపర్తి, సింగారం, నానక్‌నగర్ ,మేడిపల్లి, మల్కిద్‌గూడ, గ్రామాలతో పాటు పలు గ్రామాలలో కూడ ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో చేతికొచ్చిన పంట ఒక్కసారిగా నేలపాలు అయ్యింది. మండల పరిధిలో రైతు ఆరు ఎకరాలలో వేసుకున్న పుచ్చకాయ తోట వడగండ్ల వానకు పూర్తిగా దెబ్బతింది. దీంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అదే విధంగా మామిడి తోటలో కూడ ఈదురు గాలులకు మామిడి కాయాలు అన్ని నేలరాలి పోయాయి. దీంతో ఇంత కాలం కష్టపడ్డ కష్టంతా ఒక్క వానతో కాయలు అన్ని నేలపాలయ్యాయి. మండలంలోని వరి పంటల పరిస్థితి కూడ అదే విధంగా ఉంది. రైతులందరు అప్పులు చేసి వరి పంటలు వేసి ఇంతకాలం కాపాడుకుంటు వచ్చారు. అనుకోకుండా కురిసిన వడగండ్ల వానకు వడ్లు అన్ని రాలిపోయి వరి పంట అంతా నేలకొరిగింది. చేసిన కష్టం వృధా అయి చేతికొచ్చిన పంట నేలపాలుకావడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ బాధ ఎవరితో చెప్పుకోవాలో ..చేసిన అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తగిన పంట నష్ట పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాలలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున వరి పంటకి నష్టం వాటిల్లింది. అధికారులు దెబ్బతిన్న పంటలను గుర్తించి నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పంట నష్ట పరిహారం చెల్లించాలని కష్టకాలంలో ఉన్న రైతులను ఆదుకోవాలని రైతులు తమ ఆవేదనను వ్యక్త పరిచారు. సింగారం గ్రామంలో డగండ్ల వర్షం కురిస్తే 6గంటల వరకు కూడ వడగండ్ల రాళ్లు అలాగే ఉండటం రైతులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీన్ని బట్టి చూస్తే వడగండ్లు ఏ స్థాయిలో కురిచావో అర్థం చేసుకోవచ్చు. కావున అధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు కోరుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement