యాచారం : మండలంలో కురిసిన అకాల వడగండ్ల వానకు పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. గత వారం రోజుల నుండి ప్రతి నిత్యం ఎదో ఒక సమయంలో భారీ ఉరుములు, మెరుపులతో వర్షం పడుతునే ఉంది. వారం రోజుల క్రితమే ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానకు పెద్ద ఎత్తున వరి పంట, మామిడి, తోటల పంటలకి నష్ట వాటిల్లింది. భారీ ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురియడంతో చేతికొచ్చిన వరి పంట నేలపాలు అయ్యింది. దీంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇన్ని రోజులు కష్టపడి కాపాడుకుంటు వచ్చిన పంట ఒక్క వానతో నేలపాలు అవ్వడం వల్ల దిక్కు తోచనిస్థితిలో రైతన్నలు ఉన్నారు. ఒక వైపు కరోనాతో అందరు తల్లడిల్లి పోతుంటే మరోవైపు అకాల వడగండ్ల వానతో పంటలు నేలపాలు అవ్వడం వల్ల చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని పరిస్థితి నెలకొంది. మండల పరిధిలోని తక్కళ్లపల్లి, మేడిపల్లి గ్రామాలలో పాటు అక్కడకక్కడ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కావున అధికారులు స్పందించి జరిగిన పంట నష్టాన్ని గుర్తించి రైతులకు తగిన నష్ట పరిహారాన్ని చెల్లించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement