Friday, November 22, 2024

ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి అపూర్వ స్పందన

మన ఊరు – మన ఆరోగ్యం పేరుతో ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో RR ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మెన్, చేవెళ్ల లోక్ సభసభ్యులు డా.జి రంజిత్ రెడ్డి ఆదేశానుసారం చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో గల చేవెళ్ల మండలం, చన్ వెళ్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చింది. గ్రామంలో RR ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PMRIMS) సహకారంతో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక సర్పంచ్ పద్మ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి ప్రతి గ్రామంలో ప్రతి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారన్నారు. చాలా మందికి వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలియని పరిస్థితి ఉందన్నారు. వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందచేస్తున్నందుకు ఎంపీ రంజిత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపీ రంజిత్ రెడ్డి RR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం తమ ఊరికి ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో రక్త పరీక్షలతో పాటు ఈసీజీ కూడా తీశారు. అధిక సంఖ్యలో వచ్చిన ప్రజలు ఉచితంగా మందులు పంపిణీ, వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement