తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లా నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ముందుగా మంత్రికి అశ్వదళంతో ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి సబితా రెడ్డి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, రాచకొండ సీపీ మహేష్ భగవత్, అడిషనల్ కలెక్టర్లు తిరుపతి రావు, ప్రతీక్ జైన్, డిసిఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, ఆర్డీఓ వెంకటాచరి, ఏఓ ప్రమీల, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement