తాండూరు : నిరంకుశత్వ పాలనను విడనాడకుంటే తెలంగాణ సర్కారుపై నిరుద్యోగుల తిరుగుబాటు తప్పదని తెలంగాణ జేఏసీ నాయకులు సోమశేఖర్, బీజేపీ మహిళ మోర్చ నాయకురాలు అంతారం లలిత, టీవీవీ నాయకులు పర్యాద రామకృష్ణ, టీఎల్‌ఎఫ్ నాయకులు విష్ణువర్దన్‌తో పాటు పలువురు నాయకులు పేర్కొన్నారు. టీజేఎస్ ఫ్లోర్‌లీడర్ సోమశేఖర్ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తాండూరు పట్టణంలో టీ జేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఫ్రోఫెసర్ కోదండరామ్ అథితిగా జరగాల్సిన రౌండ్ టేబుల్ సమావేశానికి అనుమతి రద్దు చేయడాన్ని ఖండిచారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు లేని కరోనా, వైఎస్ షర్మిల కొత్త పార్టీ సమావేశాలకు లేని కరోనా కోదండరామ్ సమావేశానికి, విద్యా సంస్థలకు మాత్రమే వర్తింస్తుందని అనుమతి నిరాకరించిందని విమర్శించారు. కుట్ర పూరితంగానే సమావేశాని కి అనుమతి రద్దుచేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులపై ప్రభుత్వం వ్యవహరిస్తూ తీరుపై మండిపడ్డారు. ఉద్యోగాల నోటీఫీకేషన్లు వేయకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. ప్రైవేటు టీచర్లకు అందిస్తున్న రూ. 2వేల ఆర్థిక సహాయం, 25 కిలోల బియ్యం నేడు పెరుగుతున్న ధరలకు ఏమాత్రం సరిపోదన్నారు. ఈ ఆర్థిక సహాయాన్ని రూ. 10వేలు, 50 కిలోల బియ్యానికి పెంచి ప్రైవేటు టీచర్లతో పాటు ప్రైవేటు అద్యాపకులకు వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై దాడులకు పాల్పడితే నేడు ఆయనకు ఉద్యమకారులు, నిరుద్యోగులు తగిన బుద్దిచెప్పారన్నారు. నిరోద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తామని ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హామిలను నిలబెట్టుకోకపోతే మహేందర్‌రెడ్డికి పట్టిన గతే పడుతుందన్నారు. నిరుద్యోగులు, ప్రైవేటు అద్యాపకుల పట్ల నిరంకుశంగా వ్యవహిస్తే తెలంగాణ సర్కారుపై తిరుగుబాటుకైనా సిద్దమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎల్‌ఎఫ్ నాయకులు రవీందర్, ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ నాయకులు, టీజేఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement