తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9, 10 గంటల నుంచే భానుడు భగ భగా మండిపోతున్నాడు. అయితే తాజాగా, ఎండవేడి తట్టుకోలేక రెండు టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్‌లో కామచెరువులో జరిగింది. చెరువులో చనిపోయిన చేపలన్ని తేలి కనిపిస్తుంటే.. మత్స్యకారులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతుండటంతో చెరువుల్లో ఆక్సీజన్ శాతం తగ్గిపోయి చేపలు మృత్యువాత పడుతున్నాయి. మిగిలిన చేపలను రక్షిచుకునేందుకు బోరు మోటారు సహాయంతో చెరువులోకి నీటి వదులుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోని.. న్యాయం చేయాలని బాధిత మత్స్యకారులు కోరుకుంటున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement