Friday, November 22, 2024

ప్లాస్టిక్ క‌వ‌ర్ల వాడ‌కాన్ని నిషేధించాలి : మేయ‌ర్ నీలా గోపాల్ రెడ్డి

ఆజాది@75 స్వచ్చ సర్వేక్షణ్ 2022 లో భాగంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ లో ఏర్పాటు చేసిన వార్డ్ కమిటీ సమావేశంలో మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ స్థానికులతో మాట్లాడుతూ… డివిజన్ పరిధిలోని రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్స్, కాలనీలు, రోజూ శుభ్రంగా ఉండేలా, రోడ్ల పై ఎక్కడా చెత్త నిలవకుండా, అదే విధంగా ప్లాస్టిక్ కవర్ల వాడకం నిషేధించే దిశగా స్థానికులకు అవగాహన కల్పించడం, తడి, పొడి చెత్త విభజన, ఎప్పటికప్పుడు పరిసర ప్రాంతాల పరిశుభ్రత, వంటి ప్రధాన అంశాలను వారికి సూచించారు. సమావేశంలో ఆర్ ఓ మధుసూధన్ రెడ్డి, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ సుకృత, ఐటీసీ మాలతి, ఇతర అధికారులు, సిబ్బంది, 12వ డివిజన్ తెరాస పార్టీ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, జనరల్ సెక్రెటరీ బట్ట మురళి, NMC ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నిరుడు యాదగిరి, 12వ డివిజన్ మహిళా అధ్యక్షులు తులసి, యూత్ ప్రెసిడెంట్ కిరణ్, 12వ డివిజన్ తెరాస పార్టీ అనుబంధ కమిటీల సభ్యులు జి శ్రీనివాస్ యాదవ్, చందు, మల్లేష్ యాదవ్, బాలరాజు, ఫేస్ 2, 3 ముఖ్య నాయకులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement