పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డా.తీగల అనిత హరినాథ్ రెడ్డి అన్నారు. ఈ రోజు షాద్ నగర్ నియోజకవర్గంలో కొండుర్గ్ మండలంలో జిల్లా పరిషత్ నిధుల నుండి రూ.85 లక్షలతో మంజూరైన పలు అభివృద్ధి పనులకు స్థానిక శాసన సభ్యులు వై.అంజయ్య యాదవ్ తో కలిసి తీగల అనిత హరినాథ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తీగల అనిత హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ… జిల్లా పరిషత్ నిధుల నుండి పల్లెలను అభివృద్ధి చేసేందుకు ఎప్పుడూ కృషి చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం పల్లెల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. కొందుర్గ్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన క్రిస్టమస్ కానుకలను లబ్దిదారులకు అందజేశారు.
కొందుర్గ్ మండల కేంద్రంలో మహిళా సమాఖ్య భవనం అంచనా వ్యయం రూ.10లక్షలు, సీసీ రోడ్డు రూ.5 లక్షలు, చెక్కలోని గూడ గ్రామంలో అంగన్వాడీ భవనం పనులకు రూ.10 లక్షలు, గంగన్న గూడెం గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు అంచనా వ్యయం రూ.5.లక్షలు, విశ్వనాథ్ పూర్ గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు అంచనా వ్యయం రూ.5 లక్షలు, లక్ష్మి దేవుని పల్లి గ్రామంలో మహిళా సమాఖ్య భవనం పనులకు అంచనా వ్యయం రూ.10లక్షలు, పాత ఆగిర్యాల గ్రామంలో మహిళా సమాఖ్య భవనం పనులకు అంచనా వ్యయం రూ.10 లక్షలు, తిరుమన్ దేవుని పల్లి గ్రామంలో మహిళా సమాఖ్య భవనం పనులకు అంచనా వ్యయం రూ.10 లక్షలు, తంగేళ్ళ పల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులకు అంచనా వ్యయం రూ.5 లక్షలు అడిషనల్ క్లాస్ రూంకు రూ.7లక్షలు, డ్రైనేజ్ పనులకు రూ.5లక్షలు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ ఎదిరే రాగమ్మ, చౌడెర్గుడ జెడ్పీటీసీ స్వరూప రాములు, ఎంపీపీ జంగయ్య, వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శశిధర్ రెడ్డి, తంగళ్ళపల్లి ఎం పి టి సి రాజు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital