దేవతా హక్కుల పరిరక్షణలో తెలంగాణ ప్రభుత్వం పాలుపంచుకోవాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు చిల్కూరు బాలాజీ ఆలయంలో పూజలు చేసి, దేవతా హక్కుల సమస్యను ముందుకు తీసుకెళ్లవలసినదిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కోరతానని హామీ ఇచ్చారు. దురదృష్టకర శబరిమల తీర్పు నుండి ప్రారంభమైన ఆర్టికల్ 363 వివాదానికి మద్దతు ఇచ్చిన మొదటి ఎంపీగా, ఈ వివాదం రాజ్యాంగబద్ధతపై తన అభిప్రాయాన్ని తెలియజేయమని జస్టిస్ వెంకటాచలయ్యకు ఇటీవల లేఖ కూడా రాశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణా ప్రభుత్వం ఆలయ వ్యవస్థ పునరుద్ధరణ, పరిరక్షణ కోసం కృషి చేస్తుందన్నారు. అందువల్ల రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న ఆర్టికల్ 363 హిందూ దేవత హక్కుల వివాదంపై ధర్మం ప్రకారం న్యాయం కోసం భగవంతుని భక్తుల కోరికను సూచించాలనుకుంటున్నామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital