హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇందిరా పార్క్ బయలుదేరిన రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. ఏ నిబంధనలతో తమను అరెస్టు చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. ఇందిరాపార్క్‌లో ధర్నా చేసుకునే హక్కు అందరికీ ఉందని హైకోర్టు చెప్పిందని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే అడ్డుకోవడం సరికాదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇదిలా ఉంటే గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గేటు ఎక్కి దూకేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement