Saturday, November 23, 2024

ఇబ్రహీంపట్నం కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం వద్ద ఉద్రిక్తత

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. తమ గోడు తెలియజేయడానికి విద్యార్థినీలు రోడ్డుపై ధర్నా నిర్వహించిన పాపానికి విద్యార్థినీలను నిర్బంధించి తల్లిదండ్రులతో మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు. భారీ పోలీసు బలగాలతో తల్లిదండ్రులను వివిధ పార్టీ నాయకులను విద్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.

కస్తూర్భా విద్యాలయం ప్రాంతం జైలు వాతావరణాన్ని తలిపిస్తోంది. తమ పిల్లలని చుసుకోవటానికి 6 గంటలుగా ఎదురుచూస్తున్నా.. వారికి ఆ అవకాశం ఇవ్వటం లేదు. తమ పిల్లలు ఇక్కడ సరైన సదుపాయాలు లేవని తమతో చెప్పినా.. ఉన్నత చదువు కోసం తప్పదని చెప్పామని.. కానీ రోజురోజుకు ఇక్కడ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని ఈరోజు పరిణామాలు చూసిన తరువాత తమ పిల్లలకు చదువు లేకపోయినా బ్రతికి ఉంటే చాలని అనిపిస్తుంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు పిల్లల్ని చూయించకపోవటానికి ఆంతర్యం ఏంటో అర్థం కావటం లేదని విద్యార్థి సంఘ నాయకులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement