బొంరాస్ పేట్, ఆగస్ట్ 22 (ప్రభ న్యూస్) : 18 సంవత్సరాలు పూర్తయిన యువతీ, యువకులు
ఓటరు నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ జి.లింగ్యా నాయక్ అన్నారు. అడిషనల్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తదుపరి మొదటిసారి మంగళవారం బొంరాస్ పేట్ తహసీల్దార్ కార్యాలయంను ఆయన సందర్శించారు. ప్రభుత్వం ఓటరు నమోదు కోసం 3వ సారి చివరి అవకాశం కల్పించిందని తెలిపారు. ఈనెల 21 నుండి వచ్చే నెల 19వరకు ముందస్తు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
26, 27 తేదీల్లో స్పెషల్ క్యాంపియన్ డే ఉంటుందన్నారు. ఉదయం 10నుండి సాయంత్రం 5వరకు ఆయా గ్రామాలలోని పోలింగ్ బూత్ లలో బీఎల్ఓ ల ఆధ్వర్యంలో నమోదు చేసుకోవచ్చుని తెలిపారు. ఇందులో నమోదు చేసుకున్న వారికి వచ్చే ఎన్నికలలో ఓటు వేసే హక్కు ఉంటుందన్నారు. ఓటరు నమోదు చేసుకొనేవారు అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలని, వారు మాత్రమే నమోదుకు అర్హులని తెలిపారు. అదేవిదంగా ఓటరు జాబితాలో మిస్సింగ్ పేర్లు ఉన్నవారు కూడా నమోదు చేసుకోవచ్చని అన్నారు.