మొయినాబాద్ : స్వేరో స్వర సునామీ సాంస్కృతి కార్యక్రమాన్ని జయపద్రం చేద్దామని స్వేరో సర్కిల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నెపాగ నర్సింగ్‌రావ్ అన్నారు. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఇన్‌స్పెక్టర్ రాజు, స్థానిక స్వేరో నాయకులతో కలిసి స్వేరో స్వర సునామీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏప్రిల్ 4 తేదీన సాయంత్రం 4 గంటలకు హైదారాబాద్‌లోని కులీ కుతుబ్‌షా స్టేడియంలో (సిటీ కళాశాల దగ్గర)లో జరుగబోయే స్వేరో స్వర సునామీ సంస్కతి కార్యక్రమంలో మొయినాబాద్ మండలంలోని ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ నారాయణ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం వెంకట్‌రెడ్డి, టీజీపీ ఏ మహిళ అధ్యక్షురాలు బంటు లక్ష్మిసుజాత, యాదమ్మ, స్వేరోస్ ఇంటర్నేషన్ జిల్లా అధ్యక్షుడు కర్రోల్ల శ్రీధ ర్, కోశాధికారి సురేష్, ఆలిండియా అంబేద్కర్ సంఘం చేవెళ్ల మాజీ అధ్యక్షుడు షాబాద్ ప్రవీణ్, అడ్వైసర్ కుమార్, ఫిట్ ఇండియా మండల అధ్యక్షుడు జంగం యాదగిరి, టీజీపీఏ మండల అధ్యక్షుడు దయానంద్, స్వేరో నాయకులు మోత్కుపల్లి సునీల్, మాల అని ల్, కర్రోల్ల చిన్న శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement