కుత్బుల్లాపూర్ : ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్చత సాధ్యమని, ప్రతిఒక్కరు చెత్తను తడి , పొడి చెత్త డబ్బాలలో ఉంచి వాటిని ఇంటి ముందుకు వచ్చే స్వచ్ఛ ఆటోలో వేయాలని ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. పారిశుద్ద్య నిర్వాహణలో భాగంగా తడి, పోడి చెత్త సేకరణకు జీహెచ్‌ఎంసీ ద్వారా మంజూరైన 11 స్వచ్చ ఆటోలను కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద వారు ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయడంతో వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని, కాబట్టి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్తగా ప్రారంభించిన స్వచ్చ ఆటోలో తడి, పొడి చెత్తకు వేర్వేరు పార్టిషన్ ఉండడంతో పాటు ప్రమాదకర వ్యర్థాలకు సపరేట్ బాక్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు ఉపయోగించుకోని ఖాళీ స్థలాల్లో చెత్తను వేయకుండా బాధ్యతగా స్వచ్చ ఆటోలకు అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీలు రవీందర్‌కుమార్, మంగతాయారు, కార్పొరేటర్లు కొలుకుల జగన్, బి. విజయ్ శేఖర్‌రెడ్డి, రషీదా మహ్మద్ రఫీ, మంత్రి సత్యనారాయణ, చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి, డివిజన్ అధ్యక్షులు మహ్మద్ రఫీ, సీనియర్ నాయకులు సురేష్‌రెడ్డి, ఏఎంఓహెచ్‌లు ప్రశాంతి, భానుచందర్, ఎస్‌ఎస్ పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement