Sunday, November 17, 2024

విద్యార్థులకు బహుమతులు..

కుత్బుల్లాపూర్ : దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌ రెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన విద్యార్థులు అన్వేషణ 2021 జాతీయ స్థాయిలో నిర్వహించిన (ఆన్‌లైన్‌ ద్వారా) పోటీలలో మొదటి బహుమతి సాధించారు. బహుమతి, ప్రశంసాపత్రంతో పాటు రూ. 30,000 నగదు కూడా విద్యార్థులు గెలుచుకున్నారు. ఈ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. కోవిడ్‌ 19 కారణంగా ఈ సంవత్సరం ఆన్‌లైన్‌ మాధ్యమంలో జాతీయ స్థాయిలో నిర్వహించారు. ఈ పోటీలను అగస్త్య ఫౌండేషన్‌ వారు ప్రతిఏటా ఇంజనీరింగ్‌ విద్యార్థులలో పోటీతత్వాన్ని వారిలోని దాగి ఉన్న సాంకేతిక పరిజ్ఞనాన్ని వెలికితీయడానికి జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఎంఎల్‌ఆర్‌ఐటీ, ఎరోనాటికల్‌ విభాగానికి చెందిన విద్యార్థులు ముస్కాన్‌ ప్రసాద్‌, హరిక్రిష్ణ, ఈ ఇరువురు మేడ్చల్‌ జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు శ్రేయ (8 క్లాస్‌), మనీష (8 క్లాస్‌)లతో కలిసి ప్లాస్టిక్‌ శ్రద్దర్‌ అనే పరికరాన్ని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ లోని సాంకేతిక వనరులు ఉపయోగించి రూపొందించారు. ఈ పరికరం వేస్ట్‌ ప్లాస్టిక్‌ని రిసైకిలింగ్‌ చేసి (పునరుత్పాతన) చేయడానికి ఉపయుక్తమయి పరికరాన్ని తయారు చేసి తద్వారా ప్లాస్టిక్‌ వల్ల ప్రకృతికి లేదా పర్యావరణానికి హాని కలగకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా ఎంఎల్‌ఆర్‌ఐటీ కార్యదర్శి మర్రి రాజశేఖర్‌రెడ్డి విద్యార్థులను అభినందించారు. ఎంఎల్‌ఆర్‌ఐటీ విద్యార్థులు సాంకేతికంగా ముందుండి సమాజహితం కొరకు ఎప్పుడు నూతన ఆవిష్కరణలు చేసి మేలు చేస్తారని, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి వారిలో సృజనాత్మక శక్తిని వెలికితీసి వారిని భవిష్యత్త్‌లో నూతన ఆవిష్కరణలు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నామని ఎంఎల్‌ఆర్‌ఐటీ సెంటర్‌ ఆఫ్‌ ఇంనోవేషన్‌, ఎంట్రప్రెనేర్‌ షిప్‌ సెల్‌ (సీఐఈ) నెలకొల్పి సాంకేతి పరిజ్ఞానాన్ని విద్యార్థులలో పెంపొందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా విద్యార్థులు ముస్కన్‌ ప్రసాద్‌, హరిక్రిష్ణ మాట్లాడుతూ ఎంఎల్‌ఆర్‌ఐటీ తమకు 20,000 రూపాయల నగదు ప్రాజెక్ట్‌ ఫండ్‌ క్రింది ఇచ్చి మమ్మల్ని వెన్నుతటి ప్రోత్సహించిందని, ఈ సందర్భంగా ఎంఎల్‌ఆర్‌ఐటీకి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతిక పరి జ్ఞనాన్ని ఎంఎల్‌ఆర్‌ ఐటీలోని సిఐఇ తనుకి అభిందించిందని తెలిపారు. ఎంఎల్‌ఆర్‌ ఐటీ ప్రిన్సిపల్‌ కె. శ్రీనివాస్‌రావు గెలుపొందిన విద్యార్థులను, ప్యాకల్టీ మెంటర్స్‌ను అభినందించారు. ఎంఎల్‌ఆర్‌ఐటీకి చెందిన ఏరోనాటికల్‌ హెచ్‌ఓడి డాక్టర్‌ గుప్తా పర్యవేక్షణలో ఎంఎల్‌ఆర్‌ఐటీ అధ్యాపకులు ఎ. సాయికుమార్‌ ఈ పరి శోదనలలో విద్యార్థులకు ఆ మార్గనిర్దేశనం చేశారని వారికి అభినందనలు తెలిపారు. ఎంఎల్‌ఆర్‌ఐటీ విద్యారంగంలో గణనీయమైన సేవలు చేస్తొందని అటు సమాజ వికాసానికి దోహదపడే విధంగా ఆవిష్కరణలు చేస్తోందని ప్రిన్సిపల్‌ శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement