Thursday, November 21, 2024

చిరు జల్లులే.. రైతులకు కాస్త ఊరట..

(ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి) ఉమ్మడిరంగారెడ్డి జిల్లాలో పెద్దగా సాగు నీటి ప్రాజెక్టులు లేవు. అంతా వర్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాలు కురిస్తేనే బోరుబావుల్లోకి నీళ్లు చేరతాయి. సీజన్‌ ప్రారంభమై నెలరోజులు దాటిపోయింది. భారీ వర్షాలు ఇంకా నమోదుకాలేదు. విడతల వారీగా కురుస్తున్నా మోస్తారు వర్షాలే నమోదవుతున్నాయి. భారీ వర్షాలు కురిస్తేనే వ్యవసాయ పనులు మరింతగా ముందుకు సాగే అవకాశాలున్నాయి. భారీ వర్షాలు కురిస్తే బోరుబావుల్లోకి నీళ్లు చేరతాయి. సీజన్‌ మొదటి వారంలోనే వర్షాలు ఆశించినమేర కురవలేదు. సాధారణ వర్షాలే నమోదయ్యాయి.రంగారెడ్డి జిల్లాలో జూన్‌ మాసంలో 91.7 సాధారణ వర్షపాతం కాగా 126మిల్లిమీటర్ల మేర వర్షం కురిసింది. సాధారణ వర్షాపాతానికి మించే వర్షం కురిసింది. కాకపోతే సాధారణ వర్షపాతం కంటే రెట్టింపుగా నమోదు కావల్సి ఉంటుంది. కాకపోతే భారీ వర్షాలు కురవకపోవడంతో తేడా కనిపిస్తోంది. ప్రస్తుత జూలై మాసంలో 153 మిల్లిమీటర్లు సాధారణ వర్షపాతం కాగా ఇప్పటికే 13.7 మిల్లిమీటర్లమేర వర్షం కురిసింది.

జంట జిల్లాల పరిధిలో మోస్తారు వర్షం..

రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో ఆదివారం రాత్రి మోస్తారు వర్షం కురిసింది. కొన్ని మండలాల పరిధిలో వర్షం జాలేలేదు. రంగారెడ్డి జిల్లాతో పోలిస్తే వికారాబాద్‌లో వర్షం ఎక్కువగా కురిసింది. రంగారెడ్డి జిల్లాలో 10.3 మిల్లిమీటర్లమేర వర్షంకురిసింది. ఇబ్రహీంపట్నంలో ఎక్కువ వర్షం కురిసింది. 40.2 మిల్లిdమీటర్ల మేర వర్షం నమోదయ్యింది. శంకర్‌పల్లిలో 19, శేరిలింగంపల్లిలో 15.4, గండిపేటలో 9.5, రాజేంద్రనగర్‌లో 15.4, బాలాపూర్‌లో 5.7, సరూర్‌నగర్‌లో 9.9, హయత్‌నగర్‌లో 8.7, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 10.2, మంచాల 26.9, యాచారంలో 10, కందుకూరులో 10.6, మహేశ్వరంలో 11.4, మొయినాబాద్‌ 10.6, చేవెళ్లలో 10.4, షాబాద్‌లో 11.1, కొత్తూరులో 7.1 మిల్లిdమీటర్ల మేర వర్షంకురిసింది. వికారాబాద్‌ జిల్లాలో కాస్త ఎక్కువే వర్షం కురిసింది. వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌లో అత్యధిక వర్షం కురిసింది. ఇక్కడ 40.2 మిల్లిdమీటర్ల వర్షం కురిసింది. ఆ జిల్లాలో ఇదే ఎక్కువ. మర్పల్లిలో 10, మోమిన్‌పేటలో 29, నవాబ్‌పేటలో 16.6, వికారాబాద్‌లో 27.2, పూడూరులో 24.2, ధారూర్‌లో 25.4, బంటారంలో 15, తాండూరులో 17, పెద్దెముల్‌లో 25, బషీరాబాద్‌లో 15, బొమ్మరాజ్‌పేట 13.2, కొడంగల్‌లో 10.6మిల్లిమీటర్ల మేర వర్షం కురిసింది.ఈ జిల్లా పరిధిలో నల్లరేగడి భూములు ఎక్కువగా ఉండటంతో నాలుగుఐదురోజులకొకసార వర్షం కురిసినా పంటలకు ఇబ్బంది లేదు. ఈ జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement