ఘట్‌కేసర్ : ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలో రైతులు వరి ధాన్యం నిల్వ చేసుకోవడానికి షెడ్‌ల నిర్మాణానికై రూ. 40 లక్షల నిధులు మంజూరి చేశామని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్నాల కొండల్‌రెడ్డి తెలిపారు. అవుషాపూర్ గ్రామంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ ద్వారా ఎదులాబాద్‌లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంధ్రంలో రైతులు పండించిన వరి ధాన్యం నిల్వ చేసుకొనుటకు గాను షెడ్లు నిర్మాణం కోసం రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ శాఖ రూ. 40లక్షలు మంజూరి చేయడం జరిగిందని తెలిపారు. రైతుల అభ్యర్థన మేరకు మంత్రి మల్లారెడ్డి ఆదేశాలతో మార్కెట్ కమిటీ చైర్మెన్ రామనర్సయ్య నిధులను మంజూరి చేయించినట్లు చెప్పారు. దీంతో రైతులు పండించిన వరి ధాన్యం విక్రయంచే వరకు పాడైపోకుండా నిల్వ ఉంచుకోవడానికి షెడ్‌లు నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని కొండల్‌రెడ్డి తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement