శంకర్ పల్లి, ప్రభ న్యూస్ : ఓట్లకు సమయం దగ్గర పడింది… ఇక మిగిలింది రెండు రోజులే… ఈ సమయంలో శంకర్ పల్లిలో బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. శంకర్ పల్లి ఎంపీపీ ధర్మన్న గారి గోవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ వైస్ ప్రెసిడెంట్ దండు రామ్మోహన్, చందిప్ప ఎంపీటీసీ దయాకర్ రెడ్డి ఫతేపూర్ నాయకులు శంకర్ యాదగిరిరెడ్డి, జంగయ్య ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ మాజీ మున్సిపాలిటీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ ప్రస్తుత చేవెళ్ల నియోజకవర్గ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కేఎస్ రత్నం సమక్షంలో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
శంకర్ పల్లి మున్సిపాలిటీ, మండల పరిధిలో వారి అనుచరులు దాదాపు వెయ్యి మందితో వికారాబాద్ కేంద్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యక్రమంలో అందరూ పార్టీలో చేరారు. వీరి చేరికతో మండల పరిధిలో బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగా మిగిలిపోయిన పరిస్థితి నెలకొంది. గోవర్ధన్ రెడ్డి అనుచరుల చేరికతో తమకు కొండంత బలం చేకూరినట్లు అయిందని మరింత ఉత్సాహంగా పనిచేసే ఈ ప్రాంత ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలబడి పోయేటట్లు పనిచేస్తామని భారతీయ జనతా పార్టీ నాయకులు రాములు గౌడ్, వాసుదేవ్, ప్రతాప్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తదితరులు అభిప్రాయపడ్డారు.