షాద్ నగర్, అక్టోబర్ 31 (ప్రభ న్యూస్) : షాద్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని షాద్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి విర్లపల్లి శంకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంగళవారం పెద్దఎత్తన చేరికలు జరిగాయి. షాద్ నగర్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ సమక్షంలో జెడ్పీటీసీ సభ్యులు వెంకట్ రాంరెడ్డి ఆధ్వర్యంలో ఫరూక్ నగర్ మండలం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడెం జంగయ్య, అనంత రెడ్డి, గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో 100మంది పార్టీలో చేరారు. షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. షాద్ నగర్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్స్ ఇస్తమని చెప్పి ఇప్పటి వరకు ఒక్కరికీ కూడా ఇవ్వ లేదన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 34 లక్షల ఇందిరమ్మ ఇళ్లతో జనం సంతోషంగా ఉన్నారని, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్లతో పాటు 6 గ్యారెంటీ పథకాలను ప్రజలకు అందిస్తామన్నారు.
మాజీ జెడ్పీటీసీ సభ్యులు మామిడి శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రతీ నెల రూ.2,500, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్, రైతులకు ఏటా రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరిపంటకు రూ.500 బోనస్, ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇళ్లు లేనివారికి ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షల సాయం, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని తెలిపారు. నెలకు రూ.4 వేల పింఛన్, రూ.10 లక్షల ఆరోగ్యబీమా, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతీ మండలంలో ఇంటర్నేషనల్ స్కూళ్లు నెలకొల్పుతామని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, ఈసారి తమకు అధికారం ఇస్తే తప్పనిసరిగా హామీలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.
ఫరూఖ్ నగర్ మండల జెడ్పీటీసీ సభ్యులు వెంకట్ రాంరెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సమష్టిగా కృషి చేసి, కాంగ్రెస్ బలోపేతానికి తోడ్పడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను గడపగడపకు తీసుకెళ్లి ప్రజలను చైతన్య పరచాలన్నారు. అన్నివర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వెంకట్ రాంరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఫరూఖ్ నగర్ మండల జెడ్పీటీసీ సభ్యులు వెంకట్ రాంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ మమాడి శ్యామ్ సుందర్ రెడ్డి, మాజీ సింగల్ విండో చైర్మెన్ అనంతం, వార్డు సభ్యులు అజ్మత్ బాబా, గూడెం జంగయ్య, శ్రీనివాస్, అనంత రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ జాంగారి నర్సింలు, జాం గారి రవి, ఎరోల్ల జగన్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జాంగారి జంగయ్య, కొమ్ము కృష్ణ, కావాలి కృష్ణ, గోపాల్ నాయక్, అజ్మత్ బాబా అలీ చించొడ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ర్యాకల శ్రీనివాస్, రుస్తుం పెంటయ్య, శ్రీధర్ రెడ్డి,సర్ధార్, గిరిధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.