షాద్ నగర్ ప్రభ న్యూస్ జూలై 18. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రైతు నట్టేట ముంచే విధానాలను చేయడానికి కుట్ర పన్నుతోందని అని బి ర్ యస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఓర్వలేక చిల్లర రాజకీయాలు చేస్తుందంటూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి 24 గంటల కరెంటు వద్దంటూ మూడు గంటల కరెంటు చాలని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం కొండన్నగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలపై తీర్మానం చేయించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రైతులను ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడారు. తెలంగాణ వద్దని ఈ ప్రాంతాన్ని పాలించే తెలివి కేసిఆర్ కు లేదని ఆనాడు ప్రజల ముందు ఎన్నో మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నేడు తెలంగాణ బాగుపడి కెసిఆర్ నేతృత్వంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే రాజకీయంగా అభివ్రుది ఓర్వలేక లేనిపోని విమర్శలు చేస్తున్నారని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కడుపు కొట్టాలని స్తున్నారని,పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కెసిఆర్ సీఎం అయ్యాక గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో కళ్లారా చూడాలని అన్నారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలతో తాగునీరు, సాగునీటికి ఎంతో పెద్దపీట వేసి వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేశారని కొనియాడారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను అనుభవిస్తూ మళ్లీ ప్రభుత్వం పైనే దుమ్మెత్తి పోయడం కాంగ్రెస్ పార్టీ నైజం అని విమర్శించారు. ప్రభుత్వం ఎంతో దూర దృష్టితో అనేక వర్గాలను ఆదుకునేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టారని వాటిని తీసుకుంటూనే అది ఎవరు పెట్టమన్నారు? అంటూ ప్రభుత్వంపై వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తోందని ఇది చూసి గిట్ట లేక రాజకీయంగా ఓర్వలేక తమపై నిందారోపణలు చేస్తున్నారని అంజయ్య అన్నారు.
24 గంటల కరెంటు పై వివాదా వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రైతులు తీర్మానాలు చేస్తున్నారని వీటితో కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కావాలని అంజయ్య కోరారు. ప్రజల రైతుల ఆశీర్వాదం ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరు ఏమి చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వీలైతే ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రచారం చేయాలని హితవు పలికారు. చేసిన మంచి పనులను వదిలేసి ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు మన్నె నారాయణ తదితరులు పాల్గొన్నారు.