షాద్ నగర్, (ప్రభా న్యూస్) : యువత వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి.. ఇవ్వాల (మంగళవారం) యువతను దృష్టిలో ఉంచుకొని.. ఉచిత డ్రైవింగ్ లేసెన్స్ తో పాటు ప్రమాధాలకు గురి కాకుండా గాయపడకుండా ప్రణా రక్షణ కోసం ఉచితంగా హెల్మెట్ లను పంపిణి అని అన్నారు.
షాద్ నగర్ నియోజకవర్గం లొ ఉన్న ప్రతి యువతీ యువకులు అవకాశం కల్పించామని అన్నారు. ఈ ఆ వకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. యువత మద్యం సేవించి వాహనాలను నడపకూడదని ఉచితంగా హెల్మెట్ లను పొందిన వారిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈయొక్క కార్యక్రమం లొ బిజెపి నాయకులు విజయ్ బాస్కర్, మోహన్ సింగ్, మండల అధ్యక్షులు పసుల నర్సింహా యాదవ్, మరియు వివిధ గ్రామాల భాజపా నాయకులు పాల్గొనడం జరిగింది.