Sunday, November 17, 2024

సమతా కుంభ్ – 2023 మహోత్సవాలకు శ్రీకారం

ముచ్చింతల్ లోని సమతామూర్తి దివ్యక్షేత్రం లో సమతా కుంభ్ – 2023 మహోత్సవాలు నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సమతా కుంభ్ 2023 మొదటి రోజు.. సువర్ణమూర్తి భగవద్రామానుజుల వారికి ఉత్సవారం భన్నపనంతో మహోత్సవంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజియర్ స్వామి ఆధ్వర్యంలో.. విశ్వక్సేనుడి ఆరాధన నిర్వహించారు. 10 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఎలాంటి విఘ్నాలు, ఆటంకాలు కలగకుండా.. విశ్వక్షేనుడి ఆరాధన నిర్వహించారు. అనంతరం.. యాగశాల వద్ద అంకురార్పణ కార్యక్రమం జరిపారు

. రేపటి కార్యక్రమాలుఉదయం 5:45 గంటలకు – సుప్రభాతం. 6:00 – 6:30 – అష్టాక్షరీ మంత్రం జపం.6:30am-7am-ఆరాధన, సేవా కాలం.7:30am-9am-శాత్తుముఱై, తీర్థ ప్రసాద గోష్ఠి.9am-10am-నిత్య పూర్ఱాహుతి & బలిహరణ.10:30am-11:30am-18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ.11:30am-1pm -విశేష ఉత్సవములు.1:30pm-4:30pm సాంస్కృతిక కార్యక్రమాలు.సాయంత్రం.. 5pm-5:45pm శ్రీవిష్ణు సహస్ర నామ స్తోత్ర సామూహిక పారాయణ. 6pm -7:30pm సాకేత రామచంద్ర స్వామి & 18 దివ్య దేశ మూర్తులు – 18 గరుడలపై యాగశాల ప్రవేశం7:30pm-8pm-నిత్య పూర్ణాహుతి.8pm-9pm-తిరువీధి సేవ, మంగళా శాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి

Advertisement

తాజా వార్తలు

Advertisement