Friday, November 22, 2024

అంత‌ర్గ‌త సీసీ రోడ్ల‌కోసం రూ.3.5కోట్ల నిధులు మంజూరు : స‌బితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం నియోజకవర్గంలోని గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం కోసం మహేశ్వరం నియోజకవర్గానికి రూ.3 కోట్ల 5 లక్షల నిధులు మంజూరయ్యాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే రూ.6 కోట్ల 15 లక్షలు మంజూరు కాగా, తాజాగా మంజూరైన నిధులతో కలిపి రూ.9 కోట్ల 20 లక్షలకు చేరుకున్నాయన్నారు. గ్రామాల్లో కనీస సౌకర్యాల కోసం మహేశ్వరం మండలానికి రూ.90 లక్షలు, కందుకూరు మండలానికి రూ.2 కోట్ల 15లక్షల నిధులు మంజూరయ్యాయని మంత్రి సబితా రెడ్డి తెలిపారు. గ్రామాల్లో ప్రజల అవసరాలను బట్టి పనులు చేపట్టడటం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో పల్లెలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి కల్పన కోసం ఇప్పటికే పల్లె ప్రగతి ద్వారా విశేషంగా కృషి చేసినట్లు, సీసీ రోడ్లతో పల్లెల్లో నూతన హంగులు వస్తాయన్నారు. పెద్ద ఎత్తున నియోజకవర్గానికి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement