Monday, October 21, 2024

RR | భారీ వర్షం.. నీటమునిగిన గేటెడ్ కమ్యూనిటీ..

శంకర్ పల్లి (ప్రభ న్యూస్) : రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గేటెడ్ కమ్యూనిటీ విల్లాల్లోకి వరద పోటెత్తుతొంది. శంకర్ పల్లి మండలం మోకిల గ్రామంలోని 212 విల్లాల్లో సుమారు వెయ్యి మంది నివాసముంటున్న లా పలోమా కమ్యూనిటీలో వరద బీభత్సం సృష్టించింది.

రెండేళ్ల క్రితం ఈ విల్లాల్లో ఈ పరిస్థితి నెలకొందని… మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైందని ఆ కమ్యూనిటీలో నివసించే వారు చెబుతున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి విల్లాలు కొనుగోలు చేశామని, మా కమ్యూనిటీ నుంచి వరదనీటిని బయటకు పంపించే క్రమంలో గ్రామపంచాయతీ సహకరించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు.

లా పలోమా కమ్యూనిటీ అధ్యక్షుడు రాజా చంద్ర మాట్లాడుతూ.. ఎగువన ఉన్న కమ్యూనిటీ నీటి ప్రవాహం కమ్యూనిటీలోకి వస్తోందని… నీటి ప్రవాహాన్ని బయటికి పంపించడానికి సరైన మార్గాలు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఈ సమస్యపై దృష్టి సారించి 1000 మందికి పైగా నివాసముంటున్న మా కమ్యూనిటీని ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యే, అధికారులకి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement