వికారాబాద్, మే 31 (ప్రభ న్యూస్): పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31 సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం శ్రీ సాయి డెంటల్ కళాశాల ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ సాయి డెంటల్ కళాశాల డాక్టర్ యాదవ రావు మాట్లాడుతూ… క్యాన్సర్ కు ప్రధాన కారణమైన పొగాకును సేవించాల్సిన అవసరం లేదని, పొగాకు ద్వారానే అధిక శాతం క్యాన్సర్ వస్తుందన్నారు.
ప్రజలు శాంతియుతంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పాటించాలని, ప్రతి వ్యక్తి పొగాకును పూర్తిగా విస్మరించాలని ఆయన సూచించారు. రాబోయే తరాలకు పొగాకు వ్యతిరేక దినోత్సవం తెలియజేసేలా కేంద్ర ప్రభుత్వం మే 31ని పొగాకు వ్యతిరేక దినోత్సవంగా గుర్తించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వాశే, డాక్టర్ నిహారిక, డాక్టర్ లోహిత సాయి డెంటల్ కళాశాల పిఆర్ఓ రవికుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.