షాబాద్ : వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పని సరిగా పాటించాలని, లేని ఎడల చట్టరిత్య చర్యలు తప్పవని షాబాద్ ఇన్‌స్పెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. షాబాద్ మండల పరిధిలోని నాగర్‌గూడ చౌరస్తాలో వాహనదారులు రోడ్డుపైన వాహనాలు నడిపించేటప్పుడు రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెంట్ తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. కార్లు నడిపించే వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకొని నడపాలని సూచించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపించడం వలన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నిబంధనలు అతిక్రమించిన ఎడల వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ ఇస్మాయిల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement