Tuesday, November 26, 2024

రేవంత్ వ్యాఖ్యలతో తెలంగాణ రైతు వ్యతిరేకిగా కాంగ్రెస్.. సబితా ఇంద్రారెడ్డి

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : 24 గంటల ఉచిత విద్యుత్ స్థానంలో 3గంటలు ఇవ్వాలని ప్రపంచ వేదికపై రేవంత్ రెడ్డి ప్రకటించి తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ వ్యతిరేకమని చాటి చెప్పారన్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రైతులకు 3 గంటల విద్యుత్ చాలంటూ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన రైతు వ్యతిరేక వ్యాఖ్యలకు నిరసనగా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల క్రాస్ రోడ్డు వద్ద భారీ నిరసన నిర్వహించారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు.

రేవంత్ వ్యాఖ్యలపై మండి పడ్డారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ వద్దని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రైతు వ్యతిరేకిగా కాంగ్రెస్ మారిపోయిందన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో రైతన్న సంతోషంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి నచ్చటం లేదన్నారు. బీజేపీ ఒక వైపు బావుల దగ్గర మోటార్లకు మీటర్లు అంటుందని, రైతు వ్యతిరేక చట్టాలు తేవటానికి ప్రయత్నించిందని, కాంగ్రెస్ పార్టీ కూడా ధరణి రద్దు అంటుందని, 24 గంటల ఉచిత విద్యుత్ వద్దంటూ రైతు వ్యతిరేకులుగా రెండు పార్టీలు ప్రవర్తిస్తున్నాయన్నారు ఆమె ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement