శంకర్ పల్లి (ప్రభ న్యూస్) 7 సెప్టెంబర్ పది రోజుల నుండి వరుసగా కురుస్తున్న వర్షాలకు శిథిలావస్థ స్థితిలో ఉన్న ఇండ్లు కూలిపోతున్నాయి, మండల పరిధిలోని గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి ఒక ఇల్లు కూలి పోయింది, సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది,
రాబోయే రోజుల్లో వర్షాలు అధికంగా ఉన్నాయని సమాచారం మేరకు, శిథిలావస్థ స్థితిలో ఉన్న ఇళ్ల లో ఎవరైనా నివాసం ఉంటూ ఉన్నట్లయితే, వారిని వెంటనే అక్కడి నుండి షిఫ్ట్ చేయాలని, లేనిపక్షంలో నిరుపేదలు తమ ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు,
గ్రామాలలో శిథిలావస్థ స్థితిలో ఉన్న ఇళ్లను దృష్టిలో ఉంచుకొని వాటిలో నివాసం ఉండేవారు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అధికారులకు సమాచారం అందించి నట్లయితే వెంటనే వారికి షెల్టర్ ఏర్పాటు చేస్తారని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని శిథిలావస్థ స్థితిలో ఉన్న ఇళ్లల్లో నివాసముండే వారికి తెలియపరచాల్సిన అవసరం ఉన్నదని గ్రామస్తులను అధికారులు కోరుతున్న పరిస్థితి నెలకొంది.