హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. సనత్ నగర్‌లోని వాల్మీకి జిమ్‌లో సీనియర్ పవర్ లిఫ్టర్ ప్రకాశ్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్, జూనియర్ మాస్టర్ మెన్, ఉమెన్ రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించారు.
విజేతలకు తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ చేతులమీదుగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కోచ్ ఆనంద్, అనిల్‌కుమార్, గోపాలకృష్ణగౌడ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.