Tuesday, November 26, 2024

TS : సీసీ రోడ్లలో నాణ్యత పాటించాలి… కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్, మార్చి 6 (ప్రభ న్యూస్): జిల్లా లో జరిగే సి సి రోడ్ల అభివృధి పనులు యెక్కడ కూడా ఆగకుండా పూర్తిచేసి , పనులు పూర్తి అయి న వాటికీ ఎఫ్ టి ఓ జనరేట్ చేయాలనీ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం ఉదయం పంచాయతీ రాజ్ ఈఈలు, డిఈలతో టెలికాన్ఫరెన్సు ద్వారా జిల్లా లో జరిగే సిసి రోడ్ల నిర్మాణ పనులు ఎక్కడ కూడా ఆగ కుండ అనుకున్న అంచనాల మేరకు పూర్తి చేయాలనీ, పూర్తి అయిన వాటికీ తప్పనిసరిగా ఎఫ్ టి ఓ జనరేట్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

- Advertisement -

గ్రామ పంచాయతి బిల్డింగ్ నిర్మాణ పనులలో జాప్యం జరుగకుండా, ప్రతి గ్రామ పంచాయతి బిల్డింగ్స్, స్కూల్ కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్స్ నిర్మాణ పనులు ఏవైతే ముందే ప్రారంభించి పెండింగ్ ఉన్న వాటిని సత్వరమే పూర్తి చేసి , పూర్తి అయిన వాటికీ తప్పని సరిగా ఎఫ్ టి ఓ జనరేట్ చేయాలనీ అధికారులకు ఆదేశించారు. జిల్లాలోసి సి రోడ్లకు మంజూరైన నిదులతో అంచనాలను రూపొందించుకొంటూ సి సి రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయలని అధికారులకు ఆదేశించారు. టెలి కాన్ఫరెన్సు లో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లు డి ఇ లు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement