కేశంపేట : ట్రస్మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రోజు ప్రైవేట్ విద్యా సంస్థల యజమాన్యాలు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.వి.ఎన్ స్వామి మాట్లాడుతూ మండల పరిధిలోని ఎక్లాస్ ఖాన్పేట గ్రామంలో కరోనా కారణంగా విద్యా సంవత్సరంపై ఎలాంటి సృష్టత ప్రభుత్వం నుండి రాకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా 3లక్షల 50వేల మంది ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవితం అగమ్యగోచరంగా మారిందని. అదే విధంగా తల్లిదండ్రులు ఫీజులు చెల్లించకపోవడంతో ప్రైవేటు విద్యా సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. బిల్డింగ్ రెంట్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ,పేపర్ బిల్స్ కట్టుకోలేక యజమాన్యాలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 12వేల పాఠశాలలో కరోనా కారణంగా 900 పాఠశాలలు మూతపడడం జరిగింది . సంవత్సర కాలంగా విద్యకు దూరంగా ఉంటున్న విద్యార్థులు భవిష్యత్తు ఎలాం ఉంటుందో అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 85శాతం మంది విద్యార్థులు అన్లైన్ విద్యకు దూరంగా ఉండడం జరుగుతుందని, సమాజంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వం చిన్న చూపు వలన నేడు వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని కావున ప్రభుత్వం కొవిడ్ నియమలకు అనుగుణంగా పక్క రాష్ట్రం మాదిరి పాఠశాలలు ప్రారంభించాలని అన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు నెలకు రూ. 6వేల గురు దక్షిణ ఇవ్వడం అదే విధంగా ప్రైవేటు విద్యా స ంస్థలను కాపాడే విధంగా ప్రత్యేకించి కొన్ని వె సులుబాటు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ 14రోజుల నిరసన కార్యక్రమాన్ని ట్ర స్మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్, రమణ రెడ్డి, వంశీ కృష్ణ, శంకర్ , రాజన్, రిజ్వన్, తదితరులు పాల్గోన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement