Friday, November 22, 2024

పైవేట్‌ పాఠశాలలను వెంటనే తెరవాలి..

షాద్‌నగర్‌ : కరోనా కారణంగా ఒక సంవత్సరం పాటు ప్రైవేట్‌ పాఠశాలలు మూతపడ్డాయి. దీనిపై ఆధారపడ్డ 35000 వేల మంది ఉపాధి కోల్పోవడం జరిగిందని వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ప్రైవేట్‌ పాఠశాలల యజమాన్యాలు, టిఆర్‌ ఎస్‌ఎంఎ రాష్ట్ర ఉపాధ్యక్షులు డివిఎన్‌ స్వామి ఆధ్వర్యంలో కూరగాయలు, పండ్లు అమ్మి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య వ్యవస్థను ని ర్వీర్యం చేస్తూ తల్లిదండ్రులను విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తూ పరీక్షలపై ఎలాంటి అవగాహాన లేకుండా అర్ధాంతరంగా పాఠశాలలు మూసివేయడం సరి కాదని అన్నారు. వెంటనే ప్రభుత్వ పాఠశాలలు తెరువాలని లేదంటే నెలకు రూ. 6వేలు ప్రతి ఒక్క ప్రైవేట్‌ టీచర్లకు అందించి ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రవి ప్రకాష్‌, ఠాగూర్‌ , జోసెఫ్‌, నాగలింగం, రమణరెడ్డి, వంశీ, కృష్ణ, రఫత్‌, రఫీ, రవి, ప్రకాష్‌, సుధాకర్‌ గౌడ్‌, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement