Wednesday, November 20, 2024

ప్రజల సంక్షేమమే ‘కేసీఆర్’‌ ధ్యేయం..

తాండూరు : ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయంగా పనిచేస్తున్నారని, రాష్ట్రంలోని పేదింటి పెండ్లిలకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ ద్వారా అండగా నిలుస్తున్నారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డిలు అన్నారు. తాండూరు మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో తాండూరు తహసీల్దార్‌ చిన్నప్పల నాయుడు, ఎంపీపీ అనితా రవిందర్‌గౌడ్‌ల ఆధ్వర్యంలో తాండూరు మండలం, తాండూరు పట్టణంలోని లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి చేతుల మీదుగా 273 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ కింద రూ. 24కోట్ల, 48 లక్షల 85,504ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కరోనా విజృంభించి సంక్షోభం తాండవిస్తున్నా తెలంగాణ సర్కారు సంక్షేమ పథకాల అమలును ఆపలేదన్నారు. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. వృద్ధులు, వితంతులు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు అసరా ఫించన్‌ అమలు చేస్తూ బాలిక తల్లి కడుపున పడినప్పటి నుంచి పౌష్టికాహారం, అమ్మఒడి, కేసీఆర్‌ కిట్‌ అందిస్తున్నారని, పెండ్లై అత్తారింటికి వెళ్లేంత వరకు పథకాలను అమలు చేస్తున్నారని, పేదింటి ఆడపడుచుల పెండ్లిల్లకు తల్లిదండ్రులకు భారం కాకుండా మేనమామ బాధ్యతగా బావించి కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ ద్వారా ప్రతి పెండ్లికి రూ. 1లక్షా 116లను కానుకగా అందించి ఆదుకుంటున్నారని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలోనే సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని అన్నారు. తెలంగాణ వైపే ఇతర రాష్ట్రాలు చూసే విధంగా చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్‌ దేశంలోనే నెంబర్‌ 1 సీఎంగా అయ్యారని అన్నారు. పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందాలని పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి పేరుతో పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నాయని అన్నారు. ప్రజల స ంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అందరు రుణపడి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సహాకార సంఘం డైరెక్టర్‌ రవీందర్‌గౌడ్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ మురళీకృష్ణగౌడ్‌, తాండూరు మండల వైస్‌ ఎంపీపీ స్వరూప వెంకట్‌రాంరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దీపా నర్సింలు, తాండూరు మార్కెట్‌ కమిటి చైర్మన్‌ విఠల్‌ నాయక్‌, వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి కోఆర్డీనేటర్‌ పట్లోళ్ల రాంలింగారెడ్డి, మార్కెట్‌ కమిటి మాజీ చైర్మన్‌ వడ్డె శ్రీనివాస్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ మంకాల రాఘవేందర్‌, నేతలు అఫ్పూ(నయూం), ఇర్ఫాన్‌, శ్రీనివాస్‌ చారి, సంతోష్‌గౌడ్‌, కోతిగోపాల్‌, పండరి, పట్లోళ్ల వెంకట్‌రాంరెడ్డి, మైనోద్దీన్‌, ఎంపీటీసీలు రాజమణి, రవిశిందే, నరేందర్‌రెడ్డి, సర్పంచులు మేఘనాథ్‌ గౌడ్‌, ఎత్తరి రాములు, పట్లోళ్ల నరేందర్‌రెడ్డి, బీడే నాగప్ప, బుడ్డెళ్లి సాయిలు, గోవింద్‌, జగదీష్‌, మదన్మోహన్‌, విజయలక్ష్మీ, స్వప్న జ్యోతి, ఉపసర్పంచులు మేడిపల్లి హేమంత్‌కుమార్‌, గోవింద్‌, జీవరత్నం, మహిళ నాయకురాలు శకుంతల, డిప్యూటి తహసీల్దార్‌ ధనుంజయ, రెవెన్యూ ఇనుస్పెక్టర్లు శ్రీకాంత్‌, రాజారెడ్డి, అధికారులు వేణు, సాయిరెడ్డి, సందీప్‌, సాయి త దితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement