Saturday, November 23, 2024

పోషణ అభియాన్‌పై ప్రతిజ్ఞ..

మేడ్చల్ : ఆరోగ్య విషయంపై పోషణ లోపం కనిపించకూడదని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్‌ రెడ్డి పేర్కోన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ పట్టణంలోని అంగన్‌ వాడీ కేంద్రంలో పోషణ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా గర్బిణీ బాలింత మహిళలకు పోషణహారం పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని అంగన్‌ వాడీ టీచర్లతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోషణ అభియాన్‌ కార్యక్రమంలో ప్రజలకు ఆరోగ్యపరమైన సూత్రాల గురించి వివరించినట్లు తెలిపారు. ప్రతి మున్సిపల్‌ పట్టణంలో పోషణ లోపం లేకుండా గర్బిణీ స్త్రీలు గుడ్లు, పప్పులు, ఆకు కూరగాయలు తీసుకోవాలని చెప్పారు. ఆరోగ్య పోషణ కోసం ప్రతి ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలాల్లో ఆకు కూరగాయలు చెట్లను పెంచాలని లక్ష్మీ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. అనంతరం అంగన్‌ వాడీ టీచర్లు, ఆయాలతో కలిసి చైర్‌పర్సన్‌ పోషణ అభియాన్‌పై పట్టణ ప్రజలకు అవగాహాన కోసం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్‌ మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దామన్నగారి ప్రభాకర్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌లు భేరి బాలరాజు, దొడ్ల మల్లికార్జున్‌ ముదిరాజ్‌, అంగన్‌ వాడీ టీచర్లు, ఆయాలు, గర్బిణీ స్త్రీలు, పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement