Thursday, September 12, 2024

RR: రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు..

వికారాబాద్, ఆగస్టు 1 (ప్రభ న్యూస్) : మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ రాష్ట్ర పిలుపుమేరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని గురువారం పోలీసులు అడ్డుకున్నారు.

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు మాజీ రైతుబంధు అధ్యక్షులు రామ్ రెడ్డి నేతృత్వంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, నాయకులు దేవదాస్, ధరూర్ మాజీ వైస్ ఎంపీపీ విజయ నాయక్, నాయకులు అశోక్, వై సత్యనారాయణ, తదితరులు దగ్ధం చేయడానికి ప్రయత్నించగా.. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులను వారు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ సుందరి, గాండ్ల మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement