Saturday, November 23, 2024

వర్షాకాలం లోపు పైపులైన్ పనులు పూర్తి చేయాలి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వ‌ర్షాకాలం వ‌చ్చేలోపు మంచినీటి పైపులైన్ ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో సాయి సామ్రాట్ నగర్ జిల్లెలగూడ, టీఎంఆర్ ఎన్ క్లేవ్ -2, టీకేఆర్ కాలేజ్ దగ్గర మీర్పేట్, యందు మంచినీటి వాటర్ పైపులైన్ పనులకు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఒకే రోజు 371 కోట్ల భారీ నిధులతో చేపట్టే పనులకు మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రూ.1200 కోట్లతో నగర శివారు ప్రాంతాల పట్టణాలకు నీటికోసం నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలో లాగా గ్రామాల్లో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదని తెలిపారు. చెరువుల మధ్యలో లింక్ ల ఏర్పాటు, రానున్న వర్షాకాలం కన్నా ముందే పనులు పూర్తి చేయాలని సబితా రెడ్డి ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement