Friday, November 22, 2024

పెరుగుతున్న కరోనా..నిర్లక్ష్యం చేస్తున్న ప్రజలు..

యాచారం : మండలంలో రోజు రోజుకి కరోనా విజృంభిస్తోంది. యాచారం పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వ ఆస్పత్రిలో 50 మందికి కరోనా ర్యాపిడ్‌ టెస్టులు చేయగా 20 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. యాచారం 3, మొగుళ్లవంపు 2, నందివనపర్తి 2, మల్కిజ్‌గూడ 1, గున్‌గల్‌ 1, మేడిపల్లి 1, తక్కళ్లపల్లి తండా 1, ధర్మన్నగూడ 1, చింతుల్ల 1, నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉంటున్న 7గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కేవలం గత రెండు రోజుల్లోనే పాజిటివ్‌ల సంఖ్య 40కిపైగా వచ్చాయి. యాచారం మండలంలో పాజిటివ్ కేసు‌లు పెరుగుతున్నా ప్రజలు మాత్రం అవేమి పట్టించుకోకుండా కరోనా పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పుకోవాలి. . ప్రజలు కరోనా పట్ల నిర్లక్ష్యం వహిస్తూ మాస్క్‌లు లేకుండా తిరుగుతూ విందులు, వినోదాలలో పాల్గొంటున్నారు. కరోనా పట్ల అవగాహాన కల్పిస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. కరోనా సెకండ్‌ వేవ్‌ రాష్ట్రంతా విజృంభిస్తుంటే ప్రజలు మాత్రం ఏమవుతుందిలే అంటూ వారం రోజులు క్వారంటైన్‌లో ఉంటే సరిపోతుంది అని కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement