Saturday, November 23, 2024

మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం : మంత్రి స‌బితారెడ్డి

మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని రాష్ట్ర‌ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో దళిత బంధు పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు సరూర్ నగర్ లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ గ్రౌండ్ లో జరిగిన యూనిట్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మూసి రివర్ ఫ్రంట్ చైర్మన్ సుధీర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాలే యాదయ్య, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు దయనంద్, ఎగ్గే మల్లేశం, కలెక్టర్ అమోయ్ కుమార్ తో కలిసి 347 మంది లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…. భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ స్పూర్తితో దళిత బంధు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
దళిత బంధు దేశానికి ఆదర్శమ‌ని…..దమ్ముంటే మీ బీజేపీ పాలిత రాష్టాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అట్టడుగున ఉన్న దళిత కుటుంబాలను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ఒక ఆపద్బాంధవునిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబడ్డారనీ హర్షం వ్యక్తం చేశారు. రక్షణ నిధి దళిత బంధు లబ్దిదారులకు భవిష్యత్తులో అండగా ఉంటుందని తెలిపారు. నియోజకవర్గానికి 2 వేల మందికి దళిత బంధు ఈ ఆర్థిక సంవత్సరంలో అందిస్తామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement