Wednesday, November 20, 2024

RR: నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి… సీఐ వెంకటేశ్వర్లు

అమనగలు,డిసెంబర్ 31 (ప్రభన్యూస్): నూతన సంవత్సర వేడుకలు ఆనందోత్సాహాలతో వినోదం విషాదంగా మారకుండా జరుపుకోవాలని అమనగలు సిఐ వెంకటేశ్వర్లు కోరారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం విధించిన నియమనిబంధనలు పాటించి వేడుకలు జరుపుకోవాలని పేర్కొన్నారు.

మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడిపే వారిపై, బైకులపై త్రిబుల్ రైడింగ్ చేస్తూ కేరింతలు కొడుతూ, బైకులను షేక్ డ్రైవింగ్ చేస్తూ, తోటి వారికి ఇబ్బంది కలిగిస్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి 12 గంటల తరువాత రోడ్ల పై కేకులు కట్ చేసినా, డీజేలు పెట్టి డ్యాన్సులు చేసినా, మద్యం సీసాలతో బహిరంగంగా తాగుతూ కనిపించినా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆస్తులను కానీ, ప్రజల ఆస్తులని కానీ ధ్వంసం చేస్తే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు నష్టపరిహారం కట్టాల్సి ఉంటుందన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే క్రమంలో అసభ్య సందేశాలు, అసభ్య ఫొటోలు, అసభ్య ఆడియోలు పంపినా సహించేది లేదన్నారు. సర్కిల్ పరిధిలో వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో కుటుంబ సమేతంగా ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement