యాచారం : మండల పరిధిలోని మేడిపల్లి నుండి నానక్‌నగర్ గ్రామానికి వెళ్లే దారిలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మార్ లకు రక్షణ కంచె ఏర్పాటు చేయాలని వారం రోజుల క్రితం ఆంధ్రప్రభలో ప్రచురించిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మార్కు మరమ్మత్తులు చేపట్టారు. రోడ్డు పక్కనే ప్రమాదకరంగా కింద ఉన్న ట్రాన్స్ఫార్మార్ను ఎత్తుగా ఫిలర్‌ను ఏర్పాటు చేసి దానిపైన ట్రాన్స్ఫార్మార్ను బిగించేందుకు విద్యుత్ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. గత వారం కిందట విద్యుత్ ప్రమాదానికి గురై మేక మృతి చెందడంతో అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మార్ను ఎతైన ప్రదేశంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. ఆలస్యంగా నైన అధికారులు స్పందించినందుకు గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement