Saturday, November 23, 2024

కొత్త పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి : ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు

కుత్బుల్లాపూర్ : కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనానికి డా.బీఆర్ అంబేద్కర్ పేరుని పెట్టాలని మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు డిమాండ్ చేశారు. గురువారం దళిత సంఘాల ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేట్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టిఆర్ఎస్ శ్రేణులు, దళిత సంఘాలు పాలాభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానించారని గుర్తు చేశారు. పార్లమెంట్ కు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడం వలన ఆయనకు భారత జాతి రుణం తీర్చుకుంటుందని స్పష్టం చేశారు. జిల్లా అంతటా దళిత సంఘాలు ముందుకు వచ్చి పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేయడం స్వాగతించదగిన అంశమని గుర్తుకు చేశారు.

తెలంగాణ దళిత సోదరుల స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ వస్తుందని తద్వారా వారి కల కచ్చితంగా సాకారం అవుతుందని ఆశించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, నిజాంపేట్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తెరాస పార్టీ కమిటీల నేతలు, తెరాస కుటుంబ సభ్యులు, ప్రజలు, దళిత సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement