జవహర్‌నగర్ : కరోనా సెకండ్ వేవ్ ఉదృతి వేగంగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉందని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ మేకల కావ్య అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటిఆర్ ఆదేశాల మేరకు 15వ డివిజన్‌లో ప్రధాన రహదారిపై రద్దీ ప్రాంతాల్లో బస్టాప్‌లలో సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారి చేయించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్వీయ నియంత్రణతోనే కొవిడ్ వైరస్ భారి నుంచి తప్పించుకోవచ్చు అన్నారు. నెల రోజుల పాటు అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావద్దని అన్నారు. ప్రతి ఒక్కరు తప్పకుండా మాస్కులు ధరించి వ్యక్తిగత పరిశుభ్రత బౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ లు , మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది, తెరాస నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
By sree nivas
- Tags
- corona danger
- jawaharnagar
- ktr
- Ranga Reddy
- Ranga Reddy District
- Rangareddy Jilla
- Rangareddy Jilla News
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- TS News Today Telugu
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement