వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని పోలేపల్లి, హకీంపేట్, లగచర్ల గ్రామాలలో మల్టి పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ప్రతిపాదనల మేరకు తాండూరు డివిజన్ సబ్ కలెక్టర్‌ను భూసేకరణ అధికారిగా నియమించినట్టు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.
మూడు గ్రామాల పరిధిలో మల్టి పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్, టీజీఐఐసీ ద్వారా ఏర్పాటు చేసేందుకు సబ్ కలెక్టర్, భూసేకరణ అధికారి గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేయడం జరిగినదని ప్రతీక్ జైన్ తెలిపారు. లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి ఘటన అనంతరం, స్థానిక రైతుల అభిప్రాయం మేరకు ఫార్మా విలేజ్‌ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం, దాని స్థానంలో మల్టి పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది.