రాజేంద్ర నగర్ నియోజకవర్గం, శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లికి చెందిన పవర్ లిఫ్టర్ క్రీడాకారిణి మల్లికా రాఘవేంద్ర గౌడ్ కు చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి చేయూతనిచ్చారు. మల్లికకు రెండు లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.ఇటీవల కేరళలోని కోయంబత్తూర్ లో జరిగిన ఏషియన్ ఉమెన్ పవర్ లిప్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ కైవసం చేసుకున్న మల్లికా రాఘవేంద్ర గౌడ్ ను సోమవారం తన ఇంటివద్ద ఘనంగా సన్మానించారు. ఎంపీ రంజిత్ రెడ్డి త్వరలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement