మొయినాబాద్: మహనీయుల ఉత్సవాలను ఘనంగా జరిపిద్దామని ఎంపీటీసీల ఫోరం అద్యక్షుడు మోర శ్రీనివాస్ అన్నారు. మొయినాబాద్ మండల కేంద్రంలో మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ బేగరి రాజు ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నేటి సమాజంలో మహనీయుల చరిత్ర కనుమరుగైపోతున్నటువంటి పాఠ్యపుస్తకాలలో మహనీయుల చరిత్రను చేర్చాలన్నారు. చరిత్ర తెలియని వారు చరిత్ర నిర్మించలేరని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా అంబేద్కర్ అనే వ్యక్తి అందరి వారు అనే విధంగా మండలంలో గత ఐదు సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు యువతకు ఆదర్శంగా ఉన్నాయని కొనియాడారు. ఏప్రిల్ మాసంలో మహనీయులు పుట్టినటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్, మహాత్మజ్యోతిరావుపూలే, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఒకటే మాసంలో జన్మించారన్నారు. వారు చేసినటువంటి త్యాగాలను యువతకు పరిచయం చేస్తూ… ఆశయాల కోసం పని చేయాలని ప్రతి యువత మంచి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్‌లు మాజి రాజేందర్‌రెడ్డి, పుల్లగల కుమార్, ఎండి షఫి, మాజీ చైర్మన్ ఉప్పరి శ్రీనివాస్, సలహాదారులు ఎండి. అన్వర్‌ఖాన్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, స్వేరోస్ సర్కిల్ మండల అద్యక్షుడు రమేష్, ఈశ్వర్, నరేందర్, చందురెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement