Friday, November 22, 2024

అసెంబ్లీలో ‘యువ’గళం..అందరూ ఫిదా..

వికారాబాద్ : జిల్లాకు చెందిన తాండూరు యువ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. బడ్జెట్‌లో సాగునీటి రంగంపై జరిగిన చర్చలో తాండూరు ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం లభించింది. ఈ అవకాశంను ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి చక్కగా వినియోగించుకున్నారు. వికారాబాద్‌ జిల్లా ఎదుర్కొంటున్న సమస్యలను చక్కగా అసెంబ్లిలో ఎత్తిచూపించారు. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలోనే వికారాబాద్‌ జిల్లా ఉన్నా..ఈ ప్రాంతంలో అనేక మండాలు..గ్రామీలు అత్యంత వెనుకబడి ఉన్నాయని రోహిత్‌రెడ్డి అసెంబ్లిలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో రైతులు సాగునీటి కొరకు ఎంతగా పరితపిస్తున్నారో స్పష్టంగా వివరించారు. ఇక జిల్లాలో గుర్తింపు పొందిన మూడు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు గురించి కూడా చక్కగా వివరించారు. కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.103 కోట్లతో సిద్దం చేయించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డిపిఆర్‌ )ను, జుంటుపల్లి ప్రాజెక్టు సామర్థ్యం పెంపు, శివసాగర్‌ ప్రాజెక్టు పూర్తికి అవసరం అయిన రూ.8 కోట్ల నిధులను కేటాయించాలని సభ ద్వారా ప్రభుత్వంను విజ్ఞప్తి చేశారు. తాండూరు మీదుగా వెళుతున్న అంతర్‌రాష్ట్ర అనుసంధాన రహదారిని పూర్తి చేస్తే పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చి అభివృద్ధి చెందుతుందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎమ్మెల్యే తన ప్రసంగంలో వివరించిన తీరు అమితంగా ఆకట్టుకుంది. అసెంబ్లిdలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఎలాంటి తడబాటు లేకుండా..స్పష్టంగా వివరాలను వెల్లడించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రసంగంపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు ఎమ్మెల్యే అసెంబ్లిdలో మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాలలో గత రెండు రోజులుగా సందడి చేస్తోంది. ఈ విడియోను పోస్టు చేసిన గంటలలోనే వేల మంది వీడియోను వీక్షించారు. మొదటి గంటలో ఏకంగా 5 వేల మంది నెటిజన్లు ఎమ్మెల్యే ప్రసంగం వీడియోను వీక్షించి అభినందించడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement